Swans

Swans
Little beautiful creations of God

Wednesday, July 7, 2010

మన ధర్మం జంతు బలిని కోరుకోదు

ప్రేమ, పాప పుణ్యాల మీద విశ్వాసం, సాటి ప్రాణి పట్ల జాలి, దయ - ఇవే మన హిందూ ధర్మానికి మూలాధారాలు. ఈ మూలాలని విస్మరించిన వ్యక్తులకి, అలాంటి వ్యక్తులు అనుసరించే మార్గానికి ఎప్పటికీ ధర్మ బద్ధత లేనట్టే !

దురదృష్టం కొద్దీ, హిందూ ధర్మం లో చెప్పబడిన అంశాలు చాలా వరకు తప్పు గా అర్థం చేసుకోబడ్డాయి లేదా స్వార్ధ పరుల చేతుల్లో అవి వక్రీకరించ బడ్డాయి. వాటి ఫలితమే మనం ఈ నాటికీ అతి సాధారణం గా చూస్తున్న జంతు బలులు. హిందూ శాస్త్రాల్లో కాని, గ్రంధాలలో కాని ఎక్కడా భగవంతుడిని చేరుకోవడానికి, పరమాత్మ ని తృప్తి పరచడానికి అమాయక ప్రాణుల రక్తాన్ని చిందించాలి అనేది లేదు. హిందూ ధర్మం లోనే కాదు, ప్రపంచం లోని చాలా ధర్మాలలో, మతాలలో జంతు బలిని సమర్ధించలేదు. ధర్మం కాని, మతం కాని మనిషి ని శాంతం గా, సంతోషం గా, తృప్తి గా ఉంచుతూ - ప్రకృతి లోని ఇతర జీవాలతో ఎలా అనుసంధానం అవ్వాలో చెప్పాయి కాని - ప్రకృతి లోని ఇతర ప్రాణుల మనుగడ ని దెబ్బ తీస్తూ ధర్మాచరణం చెయ్యమని ఎక్కడా చెప్పలేదు.

మతం పేరుతో జరిగే హింస ఎక్కడ అయినా, ఎప్పుడు అయినా, ఎలాంటి సందర్భం లో అయినా వ్యతిరేకించవలసిన విషయమే. అందులోను వేదోపనిషత్తులతో, గీత లాంటి బోధనలతో, అహింసా సిద్ధాంతం తో ప్రపంచ మానవాళికి వెలుగులు పంచిన భారత దేశ ధార్మిక జీవనానికి ఆయువు పట్టయిన హిందూ ధర్మం పేరుతో ఎక్కడ హింస జరిగినా అది - హేయం అయినది, క్షమించరానిది.

ఈ సున్నితమైన అంశం గురించి నేను సాగిస్తున్న శోధన, పోరాటాల ఫలితమే - ఈ నా రచన.

No comments:

Post a Comment